Thursday, August 21, 2008

చిత్తూరు జిల్లా సాహితీ మూర్తులు 1 : తరిగొండ వెంగమాంబ

తరిగొండ వెంగమాంబ 1730లో చిత్తూరు జిల్లా వాయల్పాడు (వాల్మీకుపురం) సమీపంలోని గుర్రంకొండ మండలం, తరిగొండ గ్రామంలో జన్మించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని అర్చించి, తరించిన భక్త కవయిత్రిగా అమెకు ప్రత్యేకత ఉంది. ఈమె తన గ్రంధాలను తరిగొండలోని నృసింహస్వామికి అంకితం ఇవ్వటం వలన ‘తరిగొండ’ వెంగమాంబగా ప్రసిద్ధి చెందింది. కృష్ణమంజరి, రాజయోగసారము, వెంకటాచల మహత్యము, శివలీలా విలాసము, విష్ణుపారిజాతము, ద్వాదశస్కంధము (ద్విపదభాగవతము), ద్విపద కావ్యాలు, నాటకాలు, శతకాలు, యక్షగాన, ప్రబంధాలు ఈమె రచనలు.



పలుప్రకియల్లో ఇన్ని గ్రంధాలు రాసిన కవయిత్రి ఆకాలంలో లేరు. ఇటీవలే వెంగమాంబకు సంబంధించిన జీవితవిశేషాలు, గ్రంథాల వివరాలను తెలుపుతూ ఒక జాతీయ సదస్సును తి.తి.దే ఉద్యోగుల శిక్షణాసంస్థ (శ్వేత) ప్రారంభించారు. ఆమె కీర్తనలకు ప్రాధాన్యత కల్పించే ప్రయత్నంలో భాగంగా ‘జీవనరాగం’ పేరిట ఆడియో CD లను విడుదల చేసారు. తరిగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెంగమాంబ ప్రతిమ తరతరాలుగా పూజలు అందుకొంటోంది. పర్వదినాలలో ఆమె ప్రతిమకు ప్రత్యేకపూజలు జరిగుతాయి.



వినవయ్యా కవులారా ! విద్వాంసులారా ! వినరయ్య మీరెల్ల విమలాత్ములారా ఘనయతిస్రాగు సంగతులు నేనెరుగ వరుస నాపేక్షించవలదు సత్కృపను

పై పద్యంలో వెంగమాంబ వ్యక్తిత్వం సృష్టంగా తెలిసివస్తుంది. హిరణ్యాక్షుడు భూమిని చాపగాచుట్టి సముద్రంలో పారేసినప్పుడు, విష్ణుమూర్తి వరాహావతారంలో వచ్చి తన కోరలతో భూమిని బయటకు తెచ్చి రాక్షసుణ్ణి సంహరించిన తరువాత తన అవతారం గురించి భార్య లక్ష్మీదేవి ఏం అడుగుతుందో సంభాషించిన ఘట్టాల్ని ఆమె వివరించిన తీరు అద్భుతమని శ్లాఘించారు విమర్శకులు.



ఇకపై ప్రతియేటా వెంగమాంబ జయంతిని, వర్థంతినీ క్రమం తప్పకుండా నిర్వహించడానికి తి.తి.దే వారు నిర్ణయించారు. ఆమె కీర్తనలు అందరూ వినటానికి వీలుగా వాటిని స్వరపరిచే ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయి. దీనితోపాటూ ఆంధ్రపత్రికలో ఈమె జీవితకథను సీరియల్గానూ, దానితోపాటూ నటి మీనా పాత్రధారిణిగా ఒక టివీ సీరియల్ నిర్మాణం ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.



*ఒక క్యాలెండర్ లో దొరికిన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాను.


***

3 comments:

srinivasa krishna said...

చిత్తూరు జిల్లా సాహితీ మూర్తులు అన్న శీర్షిక తరువాత 1 అని మీరు వ్రాసిన సంఖ్య నాకు బాగా నచ్చింది.
అంటే, మీరు మరికొంతమంది సాహితీ మూర్తులను మాకు పరిచయం చేస్తారన్న మాటే గదా.
క్యాలెండర్ లో సమాచారమైనా ఇది ఎంతో వివరణాత్మకంగా ఉంది.
అసలు ఇలా సమాచారం అందించాలన్న మీకు ఆలోచన రావడమే ప్రశంసార్హం.
ధన్యవాదాలు మహేష్ గారు.

Unknown said...

musugu mukhanike ane vishyaniki meeru comment pettinanduku chaala thanks.
Aite ikkada ardham kaakapovadaniki emi ledu. vishyanni nenu cheppalanukunnanta cheppanu.

ellanki.bhaskaranaidu said...

Thanks for giving information about TARIGONDAS VENGAMAAMBA.